తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల పట్ల శాపంగా పరిణమించిన జీవో నెంబర్ 16 రద్దుచేసి తమకు న్యాయం చేయాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ చైర్మన్ శంకర్ మాట్లాడారు. రాష్ట్రాన్ని నియంతలపాలించిన కెసిఆర్ ప్రభుత్వం దొడ్డిదారిన కాంట్రాక్ట్ పద్ధతుల విద్యాశాఖలో పనిచేస్తున్న 5వేల పైచిలుకు మందిని రెగ్యులరైజ్ చేశారని వాపోయారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని మండిపడ్డారు. ఈ విషయంపై తాము రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించామని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలపై ప్రత్యేక దృష్టిసారిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ సమస్యపై చిన్నచూపు చూస్తుందన్న భావన తమకు ఉందని అన్నారు. రేవంత్ సర్కార్కు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే జీవన రద్దుచేసి దొడ్డి దారిన ప్రభుత్వ ఉద్యోగాలు జీవన రద్దుచేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఖాళీలలో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా పాలన అందిస్తామని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రేవంత్ తెలంగాణలో అతి కీలకమైన నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించకపోతే ప్రజా ఆగ్రహానికి తప్పదని హెచ్చరించారు.