2020 -21 ఆర్థిక సంవత్సరంలో రూ. 1701.29 కోట్లను ఆస్తిపన్ను రూపెణ జిహెచ్ఎంసి సేకరించింది. వీటిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వన్ టైం సెటిల్ మెంట్ పథకం ద్వారా రూ. 399.20 కోట్లు లభించాయి. కాగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆస్తిపన్ను రూ. 1472.31 కోట్లను సేకరించింది. ఈ ఆస్తిపన్ను సేకరణలో ఖైరతాబాద్ జోన్ రూ. 491.69 కోట్లతో మొదటి స్థానంలో నిలువగా, రూ. 285.84 కోట్లతో కూకట్ పల్లి జోన్ ద్వితీయ స్థానంలో నిలిచింది. సికింద్రాబాద్ జోన్ రూ. 259.78 కోట్లు, ఎల్బీనగర్ జోన్ రూ. 246.74 కోట్లు, చార్మినార్ జోన్ రూ. 126.96 కోట్లను సేకరించాయి.