మంగళవారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ సాగనుంది.
ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు, పోలీసు ఉన్నతాధికారులు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే నగరవాసులు మాత్రం గ్రేటర్ ఎన్నికలను చాల లైట్ తీసుకుంటున్నారు. నగరంలో ఉదయం నుండి ఎక్కడ కూడా 10 శాతం పోలింగ్ కూడా జరగలేదని అధికారులు చెపుతున్నారు.
గత రెండు ఎన్నికల్లో పోలింగ్ 50 శాతం మించలేదు. ఐదేళ్ల పాటు నగర భవిష్యత్‌ను ఎవరికి అప్పగించాలో నిర్ణయించే ఎన్నికలను ఓటర్లు లైట్ తీసుకుంటున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటేసేందుకు ఆసక్తి చూపలేదు. సాధారణ ఎన్నికల్లో కంటే గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉంటుందంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.