ఉప్పల్ నియోజకవర్గంలో పర్యటించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

ఉప్పల్ నియోజకవర్గంలో ని చిలుకానగర్ డివిజన్ లోని కళ్యాణపురి కాలనీ మరియు హైకోర్టు కాలనీ  నాచారం డివిజన్ లోని హెచ్ ఎం టీ కాలనీ ల లో పర్యటించిన నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి   ఈ సందర్భంగా 25 కాలనీ లకు సంబందించిన డ్రైనేజీ  సమస్యలని రోడ్ల సమస్యలను స్థానికులు వివరించారు. పక్కనే 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ngri మరియు csir తో ఉన్న కొన్ని సమస్యలను మేయర్ దృష్టికి తీసుకురాగా వెంటనే NGRI డైరెక్టర్ డాక్టర్ వీరేంద్ర తివారి తో మేయర్  సమావేశమై పలు సమస్యలను పరిష్కరించాలని కోరారు.

అలాగే హెచ్ ఎం టీ నల్ల చెరువు దగ్గర ఉన్న లింకు రోడ్లను అలాగే బఫర్ జోన్లను మేయర్  పరిశీలించి వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి ని ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి   చీలుకానగర్ కార్పోరేటర్ గీత జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అరుణ ఇంజినీరింగ్ ఈఈ నాగేందర్ పలువురు ప్రజాప్రతినిధులు జీ హెచ్ ఎంసీ ఆఫీసర్లు పాల్గోన్నారు