గ్లోబల్ మేయర్ల సదస్సుకు మేయర్ విజయలక్ష్మి కి ఆహ్వానం, భారత్ నుండి ఏకైక మేయర్

వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించి నగరాల్లో మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై యునెటెడ్ నేషన్స్ ఇన్ఫర్మేషన్, కమ్యునికేషన్ టెక్నాలజి ఆధ్వర్యంలో నిర్వహించనున్న గ్లోబల్ మేయర్ల సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్మ్షి ని ఆహ్వానిస్తూ అరుధైన ఆహ్వానం లభించింది. ప్రపంచంలోని 40 నగరాలకు చెందిన మేయర్లకు మాత్రమే ఈ వెబ్ ఆధారిత సదస్సులో పాల్గొనేందుకు అవకాశం దక్కగా భారతదేశం నుండి కేవలం హైదరాబాద్ నగర మేయర్ కు మాత్రమే ఈ అవకాశం లభించింది. ఏప్రిల్ 16వ తేది శుక్రవారం రాత్రి 8.15  గంటల నుండి 10:15 గంటల వరకు జరిగే ఈ సదస్సులో ఐక్యరాజ్య సమితి సెక్రెటరి జనరల్ ఆంటోనియో గుటారెస్ స్వాగతోపాన్యాసం చేస్తారు.

ఈ సదస్సు నిర్వహణలో ప్రధాన పాత్ర వహిస్తున్న లాస్ ఎంజెల్స్ మేయర్ ఎరిక్ గర్సెట్టి కూడా అధ్యక్ష స్థానంలో ఉపన్యాసం చేస్తారు. కోవిడ్-19 మహమ్మారిని అదిగమించడం, హరిత, పర్యావరణ పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలు, నిర్థారిత లక్ష్యాలపై మేయర్లు ప్రసంగిస్తారు. వీరితో పాటు యూనైటెడ్ నేషన్స్ హ్యాబిటాట్ కు చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైమూనా మహ్మద్ షరీఫ్ కూడా ప్రసంగించే ఈ సదస్సులో మెల్బోర్, టోకియో, జకార్త, లియోయోడీజినిరో, ప్యారీస్, మిలన్, మాంట్రియల్, బార్సిలోనా, జోహనస్ బర్గ్ తదితర ప్రముఖ అంతర్జాతీయ నగరాల మేయర్లు ఈ సదస్సులో పాల్గొంటారు. కాగా ఈ సదస్సు లో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా ప్రసంగిస్తారు.