గ్రేటర్ హైదరాబాద్ లో కరోనాను నింయత్రించేందుకు చేపడుతున్న చర్యలు, కరోనా సంబంధిత అంశాలపై నగరవాసులకు సమాచారం అందించేందుకు జిహెచ్ఎంసిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో సమాచారాన్ని పొందేందుకు గాను 040-21 11 11 11 అనే నెంబర్ ను జిహెచ్ఎంసి ఏర్పాటు చేసింది. 24/7 పనిచేసేవిధంగా ఈ కంట్రోల్ రూం పర్యవేక్షనకు ప్రత్యేక అధికారిగా అనురాధను నియమిస్తూ ఆదేశాలు జారీచేశారు.