ఒకటో తారీకు వచ్చిందంటే చాలు గ్యాస్ ధర పెరుగుతుందో..తగ్గుతుందో అని సామాన్య ప్రజలు ఖంగారు పడుతుంటారు. ఈరోజు ఒకటో తారీకు వచ్చిందో లేదో..సామాన్య ప్రజానీకానికి గ్యాస్ భారం పడింది. ఎల్‌పీజీ సిలిండర్ ధర ను రూ. 25 లకు పెంచుతూ ఆయిల్ కంపెనీ లు ప్రకటించాయి. ధరల పెంపు ఈరోజు నుంచే అమలులోకి వస్తుంది. గ్యాస్ సిలిండర్ ధర పెరగడం 15 రోజుల్లోనే ఇది రెండో సారి కావడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన గ్యాస్ ధరల బట్టి చూస్తే..సిలిండర్ బుక్ చేసుకోవాలంటే రూ.975 వరకు చెల్లించుకోవాలి. ఇందులో సిలిండర్ బుకింగ్ ధర రూ.945. దీనికి డెలివరీ బాయ్ తీసుకునే రూ.30 జత చేస్తే.. రూ.975 అవుతుంది. అంటే దాదాపు రూ.1000 పెడితే కానీ గ్యాస్ సిలిండర్ పొందలేం.