Site icon TeluguMirchi.com

గ్యాస్ లీక్ : ఆ విష వాయువు పీల్చడం వల్ల ఎలా ఉందో కళ్లకు కట్టినట్లు చెప్పిన యువకుడు

విశాఖ పట్నం లోని గోపాలపట్నం పరిధిలోని ఆర్‌.ఆర్‌. వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన లీకైన విషవాయువు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటికే ఈ విష వాయువు కారణంగా ఎనిమిది మంది మరణించగా..వందలమంది స్పృహ లేకుండా హాస్పటల్ లలో చికిత్స తీసుకుంటున్నారు.

ఈ విష వాయువు పీల్చడం వల్ల ఊపిరి తీసుకోలేని స్థితిలో ప్రజలు ఉన్నారని యువకుడు. రాత్రి సుమారు 2.30 నిమిషాల సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా ఈ విషవాయువులు వ్యాప్తి చెందాయని స్ధానికంగా ఉంటున్న నవీన్ అనే యువకుడు తెలిపాడు. ఈ వాయువు పొగమంచు మాదిరిగా వేగంగా చుట్టముట్టేయడంతో ప్రజలు ఎటూ పోలేని పరిస్థితి వచ్చిందని అతను తెలిపాడు. ఈ విషవాయువు వల్ల ఊపిరి తీసుకోలేని స్థితిలో ప్రజలు ఉన్నారని అతను తెలిపాడు. అంతేకాక శరీరం అంతా మంటలు, కంటిలో నుంచి నీళ్లు రావడం జరిగిందని తెలిపాడు. రోడ్డుపై నడుస్తుండగానే ఎవరంతట వాళ్లే కిందపడిపోయారని తెలిపాడు. ఇంత జరుగుతున్నా ఎల్జీ పాలిమర్స్ కంపెనీ యాజమాన్యం మాత్రం పట్టించుకోలేదని యువకుడు వాపోయాడు. వారి వద్ద కార్లు ఉన్నా అపస్మాకరకస్థితిలో రోడ్డుపై పడి ఉన్న వారిని కాపాడేందుకు ముందుకు రాలేదని చెప్పుకొచ్చాడు.

Exit mobile version