గురువారం తెల్లవారు జామున విశాఖలోని ఆర్.ఆర్. వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి రసాయన వాయువు (స్టరైన్) లీక్ కావడం ఇప్పుడు ప్రజల్లో భయాందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే ఈ వాయువు కారణంగా ఆరుగురు చనిపోగా..వందలమంది అస్వస్థకు గురయ్యారు.
ఈ గ్యాస్ దాదాపుగా ఐదు కిలోమీటర్ల వరకు గ్యాస్ వ్యాపించినట్టు అధికారులు చెప్తున్నారు. ఈ గ్యాస్ ప్రభావం మనుషులపై మాత్రమే కాకుండా పశువులపై కూడా పడింది. ఇప్పటికే గ్యాస్ వ్యాపించిన గ్రామాల్లోని పశువులు అనేకం మరణించాయి.
ఈ గ్యాస్ వలన పచ్చని చెట్లు కూడా రంగు మారిపోతున్నాయి. చెట్ల రంగులు మారిపోవడం అన్నది అందరిని భయపెడుతున్నది. ఎలాంటి ప్రమాదకరమైన వాయువులు విడుదలైనప్పటి కూడా చెట్ల రంగులు అంత త్వరగా మారవు. కానీ, స్టైరిన్ గ్యాస్ లోని కెమికల్స్ రియాక్షన్ వలన ఆ గ్యాస్ మరింత విషపూరితంగా మారినట్టు తెలుస్తోంది. దీంతో చెట్లు కూడా వాడిపోతున్నాయని అధికారులు చెప్తున్నారు.