Site icon TeluguMirchi.com

గ్యాస్ లీక్ ప్రమాదం : 12 కి చేరిన మృతుల సంఖ్య

విశాఖ పట్నం లోని గోపాలపట్నం పరిధిలోని ఆర్‌.ఆర్‌. వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన లీకైన విషవాయువు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ గ్యాస్ లీక్ ద్వారా ఇప్పటివరకు 12 మంది చనిపోయినట్లు అధికారులు వారి వివరాలను తెలిపారు.

మృతుల్లో ఓ వైద్య విద్యార్థి, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కేజీహెచ్ ఆస్పత్రిలో మూడు వార్డుల్లో 193 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్నవారిలో 47 మంది చిన్నారులు ఉన్నారు. ఇక మరణించిన వారి వివరాలు చూస్తే..

అప్పలనర్సమ్మ(45), కుందన శ్రియ(6), ఎ.చంద్రమౌళి(19), సిహెచ్‌.గంగరాజు(48), బి.నారాయణమ్మ(35), ఎన్‌.గ్రీష్మ(9), మేకా కృష్ణమూర్తి(72), పి.వరలక్ష్మి(38), ఎన్‌.నాని(40), పి.శంకర్రావు(40), వి.నూకరాజు(60), గంగాధర చౌదరి మృతి చెందారు.

Exit mobile version