ప్రమాదానికి గురైన తెలంగాణ మంత్రి కాన్వాయ్‌ ..

కరీంనగర్‌ జిల్లాలో మంత్రి గంగుల కమలాకర్‌ కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది. మంత్రి వాహనం వెనుక ఉండే ఎస్కార్ట్‌ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో కొత్తపల్లి ఎస్సైకి తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్‌లోని ఆర్టీసీ వర్క్‌షాప్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

ఎస్కార్ట్‌ వాహనం అదుపుతప్పి బోల్తా పడటంలో ఆ వాహనంలో ఉన్న ఎస్సై ఎల్లాగౌడ్‌ చేతి బొటనవేలు తెగిపోయింది. మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ జిల్లా మానకొండూరులో రైతు వేదిక నిర్మాణానికి భూమి పూజ చేసి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది