Site icon TeluguMirchi.com

రికార్డు స్థాయిలో గణేష్ నిమజ్జనం చెత్తను తొలగించిన జిహెచ్ఎంసి

గణేష్ నిమజ్జనం  అనంతరం  మొత్తం 10091.923   మెట్రిక్ టన్నుల వ్యర్థాల చెత్తను జిహెచ్ఎంసి తొలగించింది. అటు నిమజ్జనం జరుగుతుండగానే  నీటి కాలుష్యం లేకుండా గణేష్ విగ్రహాలను వెంటనే  తొలగించారు. హుస్సేన్ సాగర్ తో  పాటుగా  మిగితా ప్రాంతాల్లో   వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగింది.  ఈ  సందర్భంగా  వేల సంఖ్యలో  గణేష్  ప్రతిమలను నిమజ్జనం చేసిన నేపథ్యంలో    వ్యర్థాలను చెత్తను వెను వెంటనే  తొలగించేందుకు  నిమగ్నమయ్యారు.

నగరంలో చేర్వు లు  బేబీ  పాండ్స్ లలో నిమజ్జనం చేసిన  మొత్తం  83,186   గణేష్ ప్రతిమలను  తొలగించారు. అందులో బేబీ పాండు లలో  60 వేల 97. చెరువులలో  23,094   ప్రతిమలను  వెనువెంటనే  తొలగించేందుకు  చర్యలు చేపట్టారు. గణేష్ నిమజ్జన శోభా యాత్ర 303 కిలోమీటర్లు  పరిధిలో చెత్తను తొలగించేందుకు 215  యాక్షన్ టీమ్ లు , 8116 మంది పారిశుధ్య కార్మికులు  రేయింబవళ్ళు శ్రమించి చెత్తను వ్యర్థాలను తొలగించడం జరిగింది.

ప్రత్యేక (బేబీ పాండ్స్) నిమజ్జన కొలనులలో  నిమజ్జనం అనంతరం   దోమల నివారణకు పూర్తి స్థాయిలో ఖాళీ చేసి  గంబుసియా చేపలను వదలడంతో పాటుగా  లార్వా నివారణకు  మందును వేశారు.  ఈ విషయంలో   ఎంటమాలజి విభాగం  అధికారులు  సిబ్బంది  విశేష కృషి చేశారు. సుమారు 1600 మంది పాల్గొన్నారు.

Exit mobile version