Site icon TeluguMirchi.com

ఈసారి గణేష్ ని ఎక్కడ ప్రతిష్టించారో అక్కడే నిమజ్జనం చేయాలి

గణేష్ నవరాత్రి ఉత్సవాలు మరో మూడు రోజుల్లో మొదలుకానున్నాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంటే ఊరు వాడ గణేష్ పూజలతో , పాటలతో మారుమోగిపోవాల్సిందే. కానీ ఈసారి మాత్రం కరోనా మహమ్మారి వచ్చి ఏ పండగను చేసుకోకుండా చేస్తుంది. ఆఖరికి ఈసారి గణేష్ పండగా కూడా సాదాసీదాగా చేసుకోవాల్సి వచ్చింది.

 కరోనా ఉదృతి ఎక్కువగా ఉండడం తో గణేష్ చతుర్ధి వేడుకలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ ఏడాది బహిరంగ వినాయక మండపాలు, సామూహిక నిమజ్జనానికి అనుమతి లేదని.. ఇళ్లల్లోనే పూజలు చేసుకోవాలని స్పష్టం చేసింది. విగ్రహాలు పొడవుకు 2 అడుగుల కంటే ఎక్కువగా ఉండకూడదని.. ఎక్కడ ప్రతిష్టించారో అక్కడే నిమజ్జనం చేయాలని తెలిపింది. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.

Exit mobile version