వరంగల్ లో వినాయక ట్రస్టు భవన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి వేడుకలలో భాగంగా నోట్ల కట్టలతో స్వామి వారిని పూజించారు. ఒక కోటి నలభై మూడు లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో స్వామి వారికి ప్రత్యేకంగా అలంకరణ చేశారు. 108 మంది సభ్యులు స్వామివారి అలంకరణకు కావలసిన నగదును సేకరించి వినాయక మండపాన్ని అలంకరించారు. 16 సంవత్సరాల నుండి కరెన్సీ నోట్లతో ప్రత్యేక అలంకరణ చేసి, అందరినీ ఆకట్టుకుంటున్న ఈ వినాయక మండపంలో ఈ సంవత్సరం కూడా ఒక కోటి 43 లక్షల రూపాయలతో చేసిన అలంకరణ ప్రత్యేకతను సంతరించుకుంది. దీంతో ప్రజలు పెద్ద సంఖ్యలో కరెన్సీ గణపతిని దర్శించుకుంటున్నారు.