Site icon TeluguMirchi.com

బాహుబలి కలెక్షన్స్‌ మాత్రం కూడా ఇవ్వని కేంద్రం

కేంద్రం తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని ఎంపీలు గత మూడు రోజులుగా ఉబయ సభలను అట్టుడికిస్తున్న విషయం తెల్సిందే. రాజకీయాలకు అతీతంగా ఏపీ ఎంపీలు అంతా కూడా కేంద్రం మొండి వైకరిపై యుద్దం ప్రకటించారు. దాంతో తెలుగు దేశం ఎంపీలను తాజాగా సస్పెండ్‌ చేసిన విషయం తెల్సిందే. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీ గల్లా జయదేవ్‌ తీవ్ర స్థాయిలో విమర్శించాడు.

కొత్త రాష్ట్రం అయిన ఏపీకి లక్షల కోట్లు సాయం చేయాల్సింది పోయి, కనీసం బాహుబలి సినిమాకు వచ్చిన కలెక్షన్స్‌ స్థాయిలో కూడా బడ్జెట్‌లో కేటాయించలేదు అంటూ ఎద్దేవ చేశాడు. ఒక కొత్త రాష్ట్రం అభివృద్దికి, రాజధాని నిర్మాణంకు బడ్జెట్‌లో నిధులు కేటాయించక పోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశాడు. త్వరలో కర్నాటకలో ఎన్నికలు ఉన్న కారణంగానే బెంగళూరు మెట్రోకు కేంద్రం నిధులు కేటాయించడం జరిగిందని గల్లా జయదేవ్‌ అన్నాడు. ఏపీకి న్యాయం చేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని ఆయన చెప్పుకొచ్చాడు.

Exit mobile version