కిరణ్ పార్టీకి స్క్రీన్ ప్లే సోనియానే!

gali muddu krishnama naiduసీఎం కిరణ్ కొత్త పార్టీకి స్క్రీన్ ప్లే అంతా సోనియాదే అని టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆరోపించారు. సీఎం పెట్టే పెట్టే పార్టీ మరో పీఆర్పీ అవుతుందని జోస్యం చెప్పారు. ఈ రోజు ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు పార్లమెంటులో టీబిల్లును మూజువాణి ఓటుతో ఆమోదింప చేసుకోవచ్చనే ఆలోచనకు ప్రేరణ కూడా కిరణే అని విమర్శించారు. రాష్ట్ర విభజన అంశంలో బీజేపీ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఈ రోజు చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎన్నికల బడ్జెట్టే అని విమర్శించారు.