Site icon TeluguMirchi.com

కాంగ్రెస్ గూటికి గజల్ శ్రీనివాస్

Gazal-Srinivas-to-join-Congప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ కాంగ్రెస్ గూటికి చేరారు. గతకొద్దికాలంగా గజల్ శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు (ఆదివారం) గాంధీభవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ సభ్యత్వం అదించారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన తల్లి, తాత స్ఫూర్తిగా పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా పాల్గొన్నారు.

Exit mobile version