గద్దర్‌ కొత్త పార్టీపై క్లారిటీ.. ఫ్యాన్స్‌ హ్యాపీ

ప్రజా గాయకుడు గద్దర్‌ అంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఇష్ట పడతారు. గద్దర్‌ విప్లవ నాయకుడిగా ఎన్నో వేదికలపై ప్రసంగాలు చేయడం జరిగింది. సామాజిక చైతన్యం తీసుకు రావడంలో ఆయన మాటలు ఎంతగానో ఉపయోగపడతాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్‌ చాలా క్రియాశీకంగా వ్యవహరించారు. ఇక తెంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీపై పు సందర్బాల్లో గద్దర్‌ నిప్పు కక్కడం జరిగింది.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలం అయ్యిందని రాజకీయ విమర్శలు చేయడం జరిగింది. ఆ సమయంలోనే గద్దర్‌ పొలిటిల్‌ పార్టీ పెట్టబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 2019లో జరుగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో గద్దర్‌ పార్టీ క్రియాశీలకంగా వ్యవహరించబోతుందంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు ఒట్టి పుకార్లే అంటూ స్వయంగా గద్దర్‌ క్లారిటీ ఇచ్చారు.

సంగారెడ్డి జరిగిన ఒక సమావేశంలో గద్దర్‌ ఈ ప్రకటన చేయడం జరిగింది. గద్దర్‌ రాజకీయాలపై ప్రకటన రావడంతో ఆయన్ను అభిమానించే అభిమానులు సంతోషపడుతున్నారు. గద్దర్‌ వంటి వారు రాజకీయాల్లోకి పనికి రారు అని, ఇలాంటి రాజకీయాల్లో గద్దర్‌ లాంటి వారిని అవమానం ఎదురు అవుతుందని, అందుకే ఆయన రావద్దని కోరుకున్న అభిమానులు ఇప్పుడు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.