Site icon TeluguMirchi.com

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫుల్ వేతనం

కరోనా వైరస్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతం ఇచ్చిన సంగతి తెలిసిందే. గత రెండు నెలలుగా అలాగే ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక ఇప్పుడు ఫుల్ వేతనం ఇస్తున్నట్లు కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల పూర్తి వేతనం చెల్లించాలని ఆయన అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి లాక్‌డౌన్‌ విధించడంతో రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయింది. కేంద్రం నుంచి సహాయం అందలేదు. ఉన్న కొద్దిపాటి వనరులతోనే కొవిడ్‌ నివారణ చర్యలు చేపట్టడం, వలస కూలీలను ఆదుకోవడం, పేద ప్రజలకు ఉచిత బియ్యం, నగదు పంపిణీ చేయడం వంటివి చేపట్టాల్సి వచ్చింది.

అదే సమయంలో రాష్ట్ర రైతాంగానికి అండగా నిలువాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొంత కష్టమైనప్పటికీ ఉద్యోగుల వేతనాలలో కొంతమొత్తం చెల్లించకుండా వాయిదావేశారు. పరిస్థితులు కుదుట పడిన తరువాత ఇస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉద్యోగులు స్వాగతించారు.

Exit mobile version