ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుండి నాల్గో విడుత రేషన్ బియ్యాన్ని పంపిణి చేసేందుకు అని కసరత్తులు పూర్తి చేసింది.కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ విధించడంతో అంతా ఇళ్లకే పరిమితయ్యారు. ప్రజలకు అండగా మేం ఉన్నామంటూ ప్రభుత్వం ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తుంది.
ఇప్పటికే మూడు విడతలుగా రేషన్ పంపిణీ పూర్తి కాగా.. నాలుగో విడత ఉచిత రేషన్ బియ్యాన్ని శనివారం నుంచి రేషన్ దుకాణాల ద్వారా ప్రతి బియ్యంకార్డుకు కేజీ శనగలు, కార్డులోని ప్రతి సభ్యుడికి అయిదు కేజీల చొప్పున బియ్యంను ఉచితంగా అందించనున్నారు.