హోం ఐసోలేషన్ లో ఉండేవారికి ఫ్రీ కరోనా కిట్స్ , ఎక్కడ దొరుకుతాయంటే ?

తెలంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు ఇక వారి ఇళ్ల వద్దకే కరోనా కిట్ ను సరఫరా చేస్తుంది. హోం ఐసోలేషన్ లో ఉండేవారికి చికిత్సకు అవసరమైన ఔషదాలు, మాస్కులు, శానిటైజర్లును ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుంది. ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్న కరోనా బాధితుల వద్దకే ఐసోలేషన్ కిట్ పంపాలని నిర్ణయించింది.

ప్రభుత్వం అందించే కిట్లను ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ, బస్తీదవాఖానల్లో అందిస్తున్నారు.ఈ కిట్లు మీ దాకా రాకపోయినా ఫర్వాలేదు.. దగ్గర్లో ఉన్న మెడికల్ షాప్‌లో మీరే వీటిని కొని వేసుకోవచ్చని సూచిస్తోంది. సకాలంలో ట్రీట్‌మెంట్‌ అందింతే కరోనా ఉన్నా తగ్గిపోతుంది. ఈలోగా టెస్ట్‌లు చేయించుకుని అవసరం అనుకుంటేనే ఆస్పత్రిలో చేరొచ్చు. అంతేతప్ప.. టెస్ట్‌ల ధ్యాసలో పడి మెడికేషన్ పక్కనపెడితే ప్రాణాలకే ప్రమాదం అని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిస్తోంది.

హోం ఐసోలేషన్ కిట్‌లో ఏముంటాయి….

  • ఔషధాలు, శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులు
  • హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు
  • పారాసెటమాల్ మాత్రలు
  • యాంటీ బయాటిక్స్
  • విటమిన్ సీ, ఈ, డీ3 మాత్రలు
  • లివోసెటిరిజైన్
  • ఎసిడిటీని తగ్గించే మాత్రలు
  • కరోనాపై అవగాహన పెంచే పుస్తకం