అసెంబ్లీ ఆవరణలో దీక్ష !

assemblyరాష్ట్రాన్ని సమైక్యంగానే వుంచాలని డిమాండ్ చేస్తూ.. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలో దీక్షకు దిగారు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విడదీయడానికి వీల్లేదని వారు వాదిస్తున్నారు. తమ ప్రాంత ప్రజల ఆంక్షాంక్ష మేరకు ఆందోళనలు చేస్తున్నామని.. రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచేందుకు చివరి క్షణం వరుకు పోరాడుతామని వారు స్పష్టం చేస్తున్నారు. అయితే, సీమాంధ్ర ప్రజాప్రతినిధుల దీక్ష మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఆవరణలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు దీక్షకు దిగడంతో.. అసెంబ్లీ లోపల కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలు కూడా భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి ఢిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం.