సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ఎంట్రీ కోసం యావత్ సినీ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు అభిమానులతో రజనీ సమావేశం ఏర్పటు చేయడం తో ఇది ఖచ్చితంగా రాజకీయ పార్టీ ప్రకటన కు సంబదించిన సమావేశమే అని అంత ఊహించారు. కానీ రజనీ మాత్రం ఎలాంటి ప్రకటన చేయకుండా అభిమానులను నిరాశ పరిచారు.
జయలలిత, కరుణానిధిల మరణంతో రాష్ట్రంలో నాయకత్వం కొరవడినట్టుగా చర్చ సాగుతున్న నేపథ్యంలో 2017 డిసెంబర్ 31న రజనీకాంత్ చేసిన ప్రకటన అశేషాభిమాన లోకాన్ని ఆనందసాగరంలో ముంచింది. రాజకీయాల్లోకి వచ్చేశా, పార్టీతో అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొందామని రజనీకాంత్ ప్రకటన చేసి మూడేళ్లు కావస్తోంది. రజనీ మక్కల్ మండ్రం ఏర్పాటు, కార్యవర్గం నియామకం, సభ్యత్వ నమోదు తప్ప, ఈ కాలంలో తలైవా పార్టీ ఊసే లేదు. అదిగో పార్టీ, ఇదిగో జెండా అంటూ ప్రచారాలు హోరెత్తినా, చివరకు రజనీ రాజకీయ పయనం సాగేనా అన్న అనుమానాలు తాజాగా బయలుదేరాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలోని అన్ని పార్టీలు వ్యూ హాలకు పదును పెట్టి ఉంటే, తమ పార్టీ ప్రస్తావన లేకపోవడం కథానాయకుడి అభిమానులకు నిరాశే.