ఏపీలో కొత్తగా మరో 13 జిల్లాల ఏర్పటు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 13 జిల్లాలు ఉండగా..వాటికీ మరో 13 జత కావడం తో ఆ జిల్లాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొత్తగా ఏర్పడబోతున్న జిల్లాల పేర్లపై పలు వివాదాలు నడుస్తున్నాయి. మచిలీపట్నం జిల్లాకు ANR పేరు పెట్టాలని అక్కినేని అభిమానులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గుడివాడ రామపురంలో జన్మించిన అక్కినేని నాగేశ్వరరావు విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు ప్రయాణం అతి సుదీర్ఘకాలం.. అయన సినీ రంగంలో చేసిన సేవకు దాదాఫాల్కే అవార్డు వంటి అనేక అవార్డులు అందుకున్నారు. ఏఎన్నార్ ఎక్కడో మద్రాస్ లో ఉన్న సినీ ప్రపంచాన్ని ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చారు..తెలుగు వారికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన మహావ్యక్తి అని..అలాంటి గొప్ప వ్యక్తి పేరు మచిలీపట్నం జిల్లాకు పెట్టాలని అభిమానుల సంఘం ప్రభుత్వాని కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.