యురేనియం మైనింగ్ విషయమై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతోన్న విషయం తెల్సిందే. యురేనియం మైనింగ్‌కు వ్యతిరేకంగా సెలబ్రెటీల నుండి సామాన్యల వరకు తమ వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. ఈ సమయంలోనే కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి కూడా యురేనియం మైనింగ్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం జరిగింది. ఆందోళన చేస్తున్న వారికి మద్దతుగా నిలిచారు. ఈ విషయమై రేవంత్ రెడ్డి ఒకానొక సమయంలో కాంగ్రెస్ నేత సంపత్‌ను ఉద్దేశించి యురేనియం మైనింగ్ విషయమై ఆయనకు ఏం తెలియదు అంటూ వ్యాఖ్యలు చేయడం జరిగింది.
రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సంపత్ సీరియస్ అయ్యాడు. పీహెచ్‌డీ చేసిన నాకు యురేనియం పై ఏబీసీడీలు తెలియదు అన్నాడు. ఆయనలా నేను ఏదిపడితే అది వెంటనే మాట్లాడను, ఏం మాట్లాడాలన్నా కూడా ఆలోచించి మాట్లాడతాను. మరి నా గురించి రేవంత్ రెడ్డి ఎందుకు అలా మాట్లాడాడో నాకు తెలియదు అన్నాడు. ఆయన నాకు ముద్దుల అన్నయ్య అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఈ విషయమై వీరిద్దరి మద్య మాటల యుద్దం ఎక్కడి వరకు వెళ్తుందో అనే ఆందోళన కాంగ్రెస్ నాయకుల్లో వ్యక్తం అవుతోంది.