మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ అరెస్ట్

kavuriచింతలపూడి మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత మద్దాల రాజేష్ ను ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న కేంద్రమంత్రి కావూరి సాంబశివరావును అడ్డుకున్న రాజేశ్‌ను ఈ రోజు పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేసి తీసుకెళుతుండగా కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి, తోపులాటకు దారితీసింది. కావూరి ఒత్తిళ్లకు లొంగిన పోలీసులు రాజేష్ ను అన్యాయంగా అరెస్ట్ చేశారని వైకాపా కార్యకర్తలు ఆరోపించారు. సమైక్యవాదులను కావూరి ‘సన్నాసులారా, చేతకాని వెధవల్లారా’ అన్నా పట్టించుకోలేదని వాపోయారు.