Site icon TeluguMirchi.com

టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

తెలుగు దేశం మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్టు చేసారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా ధర్నా చేసేందుకు చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు ప్రయత్నించారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ధర్నాలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, చింతమనేని ప్రభాకర్ అనుచరుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.

ఈ క్రమంలో చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖాకీల రాజ్యం నశించాలి అంటూ నినదించారు. దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

Exit mobile version