తాజాగా మరోసారి సీబీఐకి ప్రత్యేక కోర్టు చిదంబరంను కస్టడీకి ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు చిదంబరంను నేటి నుండి ఈనెల 19వ తారీకు వరకు అంటే 14 రోజుల పాటు తీహార్ జైల్లో ఉంచబోతున్నారు. కరడు గట్టిన నేరస్తులకు స్థానం అంటూ దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న తీహార్ జైలుకు చిదంబరంను పంపించడం పట్ల కాంగ్రెస్ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై బీజేపీ నాయకులు కక్ష సాధిస్తున్నారు అంటూ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.