టెస్టులు విషయంలో క్లారిటీ ఇచ్చిన ఈటెల

‘‘కేసులు తక్కువగా చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. టెస్టులు చేసేందుకు ఎప్పుడూ వెనుకాడేదిలేదు. ఐసీఎంఆర్‌ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే పనిచేస్తున్నాం అన్నారు మంత్రి ఈటల రాజేందర్‌. కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళికే సవాల్‌ విసిరిందని, ఇది మతాలకు సంబంధించింది కాదు.. మనుషులకు సంబంధించిందన్నారు.

”టెస్టులు చేసేందుకు ఎప్పుడూ వెనుకాడేదిలేదు. ఐసీఎంఆర్‌ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే పనిచేస్తున్నాం. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులను హోం క్వారంటైన్‌ చేయాలని కేంద్రం చెబుతోంది. కేంద్రం కొత్త నిబంధనల ప్రకారం గాంధీ ఆస్పత్రిలో 10 మంది కంటే ఎక్కువ మంది ఉండరు. మే 8 వరకు పూర్తిస్థాయిలో కోలుకుంటాం. రాష్ట్రంలో మరణాలు లేకుండా కరోనా అంతమవుతుందని ఆశిస్తున్నాం’’అని అన్నారు ఈటల