Site icon TeluguMirchi.com

ఈటెల వ్యాఖ్యలతో టీ రాజకీయం హీట్‌

తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్‌కు గతంలో ఉన్నంత ప్రాముఖ్యత ఈసారి మంత్రి వర్గంలో లేదని చెప్పాలి. ఈటెలకు అసలు మంత్రి పదవి వస్తుందా రాదా అనే అనుమానాల నడుమ మంత్రి పదవి వచ్చింది. మంత్రి పదవి అయితే వచ్చింది కాని అప్పటి నుండి ఏదో కారణం వల్ల సీఎం కేసీఆర్‌ వల్ల తిట్లు తింటూనే ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా ఈటెలను కేసీఆర్‌ ఘాటుగా విమర్శిస్తూ వస్తున్నాడు. తాజాగా ఈటెలకు మంత్రి పదవి పోబోతుంది అంటూ వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఆ వ్యాఖ్యలపై చాలా సీరియస్‌గా ఈటెల స్పందించాడు.

తానేం టీఆర్‌ఎస్‌లోకి మద్యలో వచ్చిన వాడిని కాదు. నేను టీఆర్‌ఎస్‌ పార్టీ ఓనర్స్‌లో ఒకడిని అంటూ గట్టిగానే మాట్లాడాడు. తన గురించి మీడియాలో వస్తున్న వార్తలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టాలన ఆయన హెచ్చరించాడు. అలాగే తనను క్యాబినెట్‌ నుండి తొలగిస్తే పరిణామాలు సీరియస్‌గా ఉంటాయని సీఎం కేసీఆర్‌కు డైరెక్ట్‌గా కాకుండా ఇండైరెక్ట్‌గా వార్నింగ్‌ ఇచ్చినట్లయ్యింది. ఒకవేళ మంత్రి పదవి తొలగిస్తే ఏకంగా పార్టీ నుండే ఆయన వెళ్లి పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీలో తన ప్రాముఖ్యతపై ఆవేదనతో ఉన్న ఆయన తొలగింపుతో మరింత సీరియస్‌ అవుతాడేమో చూడాలి. ఈటెల వ్యాఖ్యలపై కేసీఆర్‌, కేటీఆర్‌ స్పందన ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version