Site icon TeluguMirchi.com

కేసులపై క్లారిటీ ఇచ్చిన ఈటెల

రాష్ట్రంలో పరీక్షలు చేయకపోవడం వల్లే కేసుల తక్కువగా నమోదవుతున్నాయనేది వాస్తవం కాదన్నారు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌. అప్రమత్తంగా ఉన్నాం కాబట్టే కేసుల తీవ్రత తగ్గిందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు సైతం కరోనా మహమ్మారి బారినపడి విలవిల్లాడుతున్నాయని గుర్తు చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సీఎం కేసీఆర్‌ అందరినీ అప్రమత్తం చేశారని అన్నారు.

ఇక తెలంగాణలో ఇవాళ కొత్తగా 6 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలిపారు. ఇవాళ కరోనా నుంచి కోలుకొని 24 మంది బాధితులు డిశ్చార్జి కాగా.. మొత్తం 464 మంది డిశ్చార్జ్‌ అయినట్లు తెలిపారు. ఇప్పటివరకు 28 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు.

Exit mobile version