Site icon TeluguMirchi.com

కిరణ్ సీఎం సీటులో కొనసాగరాదు.. !

1319548646_etela-rajender2-jpgముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డిపై తెరాస సీనియర్ నేత ఈటెల రాజేందర్ విరుచుకుపడ్డారు. ఈటెల ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చట్టాన్ని కూడా చదవకుండా వ్యవహరించడం, ఇలాంటి దౌర్బ్యాగపు ముఖ్యమంత్రి ఉండడం దురదృష్టకరమని అన్నారు. చట్టాలపై అవగాహన లేని.. కిరణ్ కు సీఎం సీటులో కొనసాగే నైతిక హక్కు లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సీఎం రాజీనామా చేయాలని ఈటెల డిమాండ్ చేశారు. తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ నేతలు కిరణ్ ను ఎందుకు నిలదీయడం లేదని ఆయన ప్రశ్నించారు.

Exit mobile version