ఏపీలో మరోసారి గ్యాస్ లీకులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుస గ్యాస్ లీకులు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ మధ్యనే విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటన మరువక ముందే తాజాగా రెండు చోట్ల గ్యాస్ లీక్ కావడం ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. కృష్ణా జిల్లాలో ఒకటి, రాజమండ్రిలో మరొక ఘటన చోటు చేసుకున్నాయి.

కృష్ణ కృష్ణా జిల్లా కైకలూరులోని శ్రీకాంత్ ఇంటర్నేషనల్ రొయ్యల కంపెనీలో గ్యాస్ లీక్ కావడం తో ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. ఘటన తెల్లవారు జామునే చోటు చేసుకోగా.. మీడియాను అనుమతించకపోవడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అలాగే తూర్పు గోదావరిలో ప్రజల గుండెల్లో కుంపటిగా మారిన ఓఎన్జీసీ నిత్యం ఎక్కడోకక్కడ గ్యాస్ లీక్‌ అవుతూ.. జనాన్ని భయాందోళనలకు గురిచేస్తోంది. ప్రజలు చూస్తుండగానే గ్యాస్ లీకేజీ పెద్ద శబ్దంతో చుట్టు పక్కలకు విస్తరించింది. స్థానికులు భయంతో పరుగులు తీశారు.