ఏపీలో దారుణంగా పెరిగిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 83 కేసులు బయటపడడం తో ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడం , ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల పైకి వస్తుండడం తో కేసులు పెరగడం మొదలుఅయ్యాయి.

ప్రస్తుతం ఏపీలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,797కు చేరింది. ఆదివారం 11 వేల 357 పరీక్షలు నిర్వహించగా 83 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో 11 కేసులు కోయంబేడుకు సంబంధించినవి కాగా 17 కేసులు విదేశాల నుంచి వచ్చిన వారివి ఉన్నాయి. కరోనా నుంచి కోలుకుని 37మంది డిశ్చార్జి అయ్యారు.