Site icon TeluguMirchi.com

వివాహిత స్నానం చేస్తుండగా వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసిన ఇంజనీరింగ్ స్టూడెంట్

ఇటీవల కాలంలో రహస్యంగా వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేయడానికి అలవాటుపడ్డారు కొందరు వెదవలు.తాజాగా ఇంజనీరింగ్ చదువుతున్న ఓ యువకుడు ఓ వివాహిత స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు. ఆ వీడియోను ఆమె‌కు చూపించి తన కోరిక తీర్చాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన కోల్ కతాలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే తన ఇంటికి దగ్గరలో ఉండే ఓ వివాహితపై కన్నేశాడు ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్. దీంతో ఆమె ఈ విషయాన్ని తన భర్తకి చెప్పింది. ఆ మహిళ భర్త ఆ యువకుడిని మందలించాడు.ఇది జరిగిన తర్వాత ఆ యువకుడు ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఆమె స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీశాడు.ఆ వీడియోను ఆమె‌కు చూపించి చెప్పినట్టు చేయకపోతే నెట్ లో వీడియో పెడతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో భార్య భర్త లు పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి ఆ యువకుడిపై ఫిర్యాదు చేశారు.

Exit mobile version