Site icon TeluguMirchi.com

ఏలూరులో ఆగని వింత వ్యాధి..

ఏలూరు లో గత వారం రోజులుగా వింత వ్యాధి ప్రజలను వణికిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య 370 పైచిలుకు చేరింది. వీరిలో 187 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. మరో 14 మంది బాధితులను గుంటూరు, విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ఇక 168 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయినట్టు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక ఈరోజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అనారోగ్యం భారినపడి అస్వస్థతకు గురైన వారిని పరామర్శించున్నారు.

ఉదయం 10 గంటల 20 నిమిషాలకు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం పరామర్శిస్తారు. తర్వాత జిల్లా అధికారులతో సమావేశం అవుతారు. మరోవైపు, ఏలూరులో ఇవాళ ప్రత్యేక వైద్య బృందాలు పర్యటించనున్నాయి. వ్యాధి నిర్ధారణ కోసం మంగళగిరి ఎయిమ్స్ డాక్టర్ల బృందం అక్కడ పర్యటించనుంది.

Exit mobile version