ట్విట్టర్​ యూజర్లకు షాక్​.. పోస్టు​లపై పరిమితులు విధించిన మస్క్..


ట్విట్టర్​లో ఇటీవల కొత్త కొత్త నిబంధనలు తీసుకు వస్తున్న ఎలన్ మస్క్ తాజాగా మరో కీలక నిబంధనతో ట్విట్టర్ వినియోగదారులకు షాక్ ఇచ్చారు. అదేంటంటే రోజువారీ చూసే ట్వీట్​ లపై వినియోగదారులకు పరిమితులు విధించారు. అయితే వెరిఫైడ్​, అన్​వెరిఫైడ్​, కొత్త అన్​వెరిఫైడ్ ఖాతాదారులకు వేర్వేరుగా ఈ పరిమితులు ఉన్నాయి. తాజా నిబంధన ప్రకారం డబ్బులు చెల్లించి ఖాతాను వెరిఫై చేసుకున్న వారు రోజుకు 6000 వేల పోస్టులు, అన్ వెరిఫైడ్ యూజర్స్ 600 పోస్టులు, ఇక కొత్తగా తీసుకున్న అన్ వెరిఫైడ్ అకౌంట్ వాళ్లు కేవలం 300 పోస్టులు మాత్రమే చూసే విధంగా పరిమితి విధించారు.

ట్విట్టర్​లో డేటా స్క్రాపింగ్, సిస్టమ్ మ్యానిపులేషన్ నివారించేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు మస్క్ తెలియజేశారు. ఇకపోతే త్వరలోనే రోజువారీ చూసే ట్వీట్ల సంఖ్యను వెరిఫైడ్ యూజర్స్ కు 8000 వేలకు, అన్ వెరిఫైడ్ యూజర్స్ లిమిట్ ను 800 లకు, ఇక కొత్త అన్ వెరిఫైడ్ అకౌంట్లకు 400లకు పెంచుతామని మస్క్ మరో ట్వీట్ ద్వారా తెలియచేసారు. ఇదిలావుంటే “వీక్షణ పరిమితి(View Limit)” ని సెట్ చేయడానికి కారణం మనమందరం ట్విట్టర్ కి అడిక్ట్ అవ్వకుండా బయటి ప్రపంచానికి వెళ్లాల్సిన అవసరం వుంది. అయినా నేను మంచి పనే కదా చేస్తున్నాను అని చెప్పుకొచ్చారు మస్క్.