గ్రేటర్ హైదరాబాద్ లో డిసెంబర్ 1న జరిగే పోలింగ్‌కు ఓటరుగుర్తింపుకార్డులేకున్నా ఈ క్రిందిగుర్తింపుడాక్యుమెంట్లను చూపించి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి డి.ఎస్.లోకేష్ కుమార్ తెలిపారు. ఓటు వేయడానికి ముందు పోలింగ్ కేంద్రంలో వారిగుర్తింపునిర్థారణకు , ఓటరుగుర్తింపుకార్డులయినా చూపాలి లేదా అవి లేనివారు వారిగుర్తింపు నిర్థారణకు కింద తెలిపిన ప్రత్యామ్నాయ ఫోటోగుర్తింపుకార్డులలో ఏదయినా ఒకదానిని చూపాలని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.
1.ఆధార్ కార్డు, 2. పాస్‌పోర్ట్, 3. డ్రైవింగ్ లైసెన్స్, 4. ఫోటోతో కూడిన సర్వీస్ ఐడెంటిఫైకార్డ్, 5. ఫోటోతో కూడిన బ్యాంకు పాస్‌బుక్, 6. పాన్ కార్డు, 7. ఆర్.జి.ఐ, ఎన్.పి.ఆర్ స్మార్ట్ కార్డు, 8. జాబ్ కార్డు, 9. హెల్త్ కార్డు, 10. ఫోటోతో కూడిన పింఛన్ డాక్యుమెంట్, 11. ఎం.ఎల్.ఏ, ఎం.పి, ఎమ్మెల్సీలకు జారీచేసిన అధికారగుర్తింపు పత్రం, 12. రేషన్ కార్డు, 13. కుల ధృవీకరణ పత్రం, 14. ఫ్రీడమ్ ఫైటర్ ఐడెంటిఫై కార్డు, 15. ఆర్మ్స్ లైసెన్స్ కార్డు, 16. అంగవైకల్యం సర్టిఫికేట్, 17. లోక్ సభ, రాజ్యసభ మెంబర్ ఐడెంటిఫై కార్డు, 18. పట్టదారు పాస్ బుక్