టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు

టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నారు. నామా నాగేశ్వరరావు కంపెనీ మధుకాన్ కంపెనీ పేరుతో 1064 కోట్లు బ్యాంకులనుండి తీసుకొని తిరిగి కట్టనందున ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. బ్యాంకుల్లో రుణాలు తీసుకొని తిరిగి కట్టకుండా విదేశాలకు నిధులు మళ్లించారనే అభియోగాలు నామా పైన ఉన్నాయి. నామాతో పాటుగా మధుకాన్ కంపెనీ డైరెక్టర్ల నివాసాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. విదేశీ కంపెనీలను నిధులు మళ్లించటంతో మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.