Site icon TeluguMirchi.com

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాలు

ప్రపంచ బ్యాంకు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డిఐపిపి) మంగళవారం తయారు చేసిన సరళీకృత వాణిజ్యం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) లో, రాష్ట్రాల్లో 98.42 శాతం స్కోరుతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరువాత స్థానంలో తెలంగాణ రాష్ట్రము 98.33 శాతం స్కోరుతో రెండవ స్థానంలో నిలిచింది. మూడవ స్థానంలో 98.07 శాతం స్కోరుతో హర్యానా, ఆ తరువాత స్థానాల్లో జార్ఖండ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ మొదలగు రాష్ట్రాలు నిలవగా చివరి స్థానంలో మేఘాలయ నిలిచింది.

గత ఏడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు జాబితాలో అగ్రస్థానంలో నిలిచాయి. కానీ ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రెండు కూడా అభివృద్ధిలోను, పెట్టుబడులు రాష్ట్రాలకు తీసుకురావడం లోను ,ఉపాధి అవకాశాలు కల్పించడంలోనూ, మొదలగు విషయాలలో పోటీ పడ్డాయి. కానీ స్వల్ప ( 0.09 శాతం ) తేడాతో తెలంగాణ రెండవ స్థానాన్ని సరిపెట్టి కోవాల్సి వచ్చింది.

మేము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్( EODB ) ర్యాంకింగ్స్ 2018 లో మొదటి స్థానాన్ని 0.09% శాతం తేడాతో కోల్పోయాము అని కేటీఆర్ ట్విట్ చేసాడు. అయినా గాని కెసిఆర్ పరిపాలనలో అధికారులు బాగా కృషి చేసారని, ఆంధ్రప్రదేశ్ ను మొదటి స్థానంలో నిలిపిన సి ఎం చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు అని ట్విట్ చేసారు తెలంగాణ ఐ టీ మంత్రి కేటీఆర్ గారు.

తెలంగాణ ఐ టీ మంత్రి కేటీఆర్ గారు చేసిన ట్విట్ ఫై ఆంధ్రప్రదేశ్ ఐ టీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఇప్పుడు ఒకటీ, రెండు పాయింట్ల తేడా అనేది కాదు. దేశం మొత్తం మీద మన రెండు తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానాల్లో నిలిచాయి. ఇది మన తెలుగు ప్రజల అభివృద్ధికి మంచిది. మీకు కూడా శుభాకాంక్షలు అని లోకేష్ ట్విట్ చేసాడు.

Exit mobile version