హైదరాబాద్లో భూ ప్రకంపనలు..పరుగులు తీసిన ప్రజలు..

హైదరాబాద్ లో వరుస సంఘటనలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా భూమిలో పెద్ద పెద్ద శబ్దాలు రావడం నగర వాసులను ఖంగారుకు గురి చేయగా…రీసెంట్ గా భారీ వర్షాలు నగరాన్ని మొచ్చేత్తాయి. ఇక ఇప్పుడు హైదరాబాద్ లో భూ ప్రకంపనలు మరింత షాక్ కు గురి చేస్తున్నాయి.

నగరంలోని వస్థలీపురం బీఎన్‌రెడ్డి నగర్‌, వైదేహినగర్‌లో గురువారం వేకువ జామున భూ ప్రకంపనలు వచ్చాయి. తెల్లవారు జామున 5.40 గంటల సమయంలో సెకను పాటు భూమి కంపించింది. శబ్దాలు రావడంతో ఇళ్ల నుంచి జనం బయటకు పరుగులు పెట్టారు. మూడుసార్లు స్వల్పంగా ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఉదయం 5.40 గంటలకు ఒకసారి, 6.45గంటలకు మరోసారి వైదేహీ నగర్‌లో పెద్దశబ్దంతో భూమి కంపించింది. 7.08 గంటలకు మూడోసారి ప్రకంపనలు వచ్చాయి. మరుసగా మూడుసార్లు భూ ప్రకంపనలు రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.