Site icon TeluguMirchi.com

Earth Hour : ఎర్త్ అవర్ – ఆ రోజు ఒక గంట లైట్లు ఆఫ్ చేయండి


ఎర్త్ అవర్ లో భాగంగా దేశ వ్యాప్తంగా మార్చి 23న సాయంత్రం 8.30 – 9.30 PM ఒక గంట పాటు లైట్లు ఆఫ్ చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్ తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో “ఎర్త్ అవర్” పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎర్త్ అవర్ అనేది గ్రహం ఎదుర్కొంటున్న ట్రిపుల్ సంక్షోభాన్ని గుర్తించడానికి, వాతావరణ మార్పులు, జీవ-వైవిధ్య నష్టం, పర్యావరణం రక్షించడానికి దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, స్విచ్ ఆఫ్ పవర్ ద్వారా ఎర్త్ అవర్ పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం వ్యక్తులు, సంస్థలు, వివిధ సంఘాలు అనవసరమైన లైట్లను ఒక గంట పాటు ఆఫ్ చేయాలని ఈ కార్యక్రమాన్ని నిర్దేశించారు.

మార్చి 23, 2024న రాత్రి 8.30- 930 గంటల సమయంలో హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్, దుర్గం చెరువు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, బుద్ధ విగ్రహం, గోల్కొండ కోట, చార్మినార్, స్టేట్ లైబ్రరీ, రాష్ట్రంలోని ఇతర స్మారక చిహ్నాలన్నింటిలో లైట్లు ఆర్పాలని ఆమె కోరారు.

Exit mobile version