మళ్లీ కాంగ్రెస్ లోకి డీఎస్..?


కొన్ని ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ లో ప్రజలకు సేవలు అందించిన డీ శ్రీనివాస్..ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కి గుడ్ బై చెప్పి టీఆర్‌ఎస్‌లో జాయిన్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వ అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారు, తెరాస రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కీలక పదవిలో ఉన్నారు. అయితే కొంతకాలం గా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్య క్రమాలకు డీఎస్ దూరం గా ఉంటున్నారని , సొంతపార్టీ కే ద్రోహం చేస్తున్నారనే ఆరోపణలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. దీంతో ముఖ్య మంత్రి డీఎస్ విషయం లో సీరియస్ అయ్యారు.

తాజాగా ఇప్పుడు డీఎస్ సొంతగూటికి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు , ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో ఆయన చర్చలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈరోజు ఉదయం నిజామాబాద్‌లో తన అనుచరులతో సమావేశమైన డీఎస్ టీఆర్ఎస్ నేతల ఆరోపణలపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

తాజా పరిణామాల నేపథ్యంలో డి.శ్రీనివాస్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నుంచి పిలుపొచ్చింది. డీఎస్‌ నిన్న కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కోరగా.. ఈరోజు ముఖ్యమంత్రిని కలవాలంటూ సీఎం కార్యాలయం నుంచి ఆయనకు సమాచారం వచ్చింది. మరి ముఖ్యమంత్రి తో భేటీ తర్వాత డీఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.