కరోనా దెబ్బ కు ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. రోజు రోజుకు మనుషుల ప్రాణాలు గాల్లో కలుస్తుండడం..పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో అన్ని దేశాలు లాక్ డౌన్ ప్రకటించి ప్రజలను ఇంటికే పరిమితం చేసాయి. అయినప్పటికీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయ్. ఈ కరోనా దెబ్బ కు భారత్ ఆర్ధిక వ్యవస్థ భారీగా నష్టపోయింది.
ఈ నేపథ్యంలో భారత్ కు అవెన్యూ సూపర్ మార్ట్స్ రిటైల్ బ్రాండ్ డీమార్ట్ భారీ మొత్తంలో ఆర్థిక సాయం చేసి వార్తల్లో నిలిచింది. ఈ మేరకు పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.155 కోట్లను విరాళంగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో పీఎం కేర్స్‌కు ఫండ్‌కు రూ.100 కోట్లు, కరోనా ప్రభావిత రాష్ట్రాలకు రూ.55 కోట్లు ఇస్తున్నట్లు వెల్లడించింది.
డీమార్ట్ ప్రమోటర్ రాధాకృష్ణన్ డామని మాట్లాడుతూ.. “భారత్‌తోపాటు ప్రపంచ దేశాలు ఇంతకుముందెన్నడూ లేని గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ప్రజలను సంరక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు మేము పూర్తిగా మద్దతిస్తున్నాం. మన సమాజాన్ని రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా తమవంతు కషి చేయాలని అని పిలుపునిచ్చారు. కాగా డీమార్ట్ పీఎం కేర్స్‌కు రూ.100 కోట్లు ప్రకటించగా.. మహారాష్ట్ర, గుజరాత్‌లకు రూ.10 కోట్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలకు రూ.5 కోట్లు, తమిళనాడు, ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌లకు రూ.2.5 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు.