Site icon TeluguMirchi.com

సీఎంకు ఆపే సీన్ లేదట !

dk arunaతెలంగాణ ఏర్పాటును ఎవరు అడ్డుకోలేరని మంత్రి డికె. అరుణ మరోసారి స్పష్టం చేశారు. గాంధీ భవన్ లో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనను అడ్డుకోవడం ఎవరి తరం కాదని… సీఎం ఆపినా తెలంగాణ ఆగదని అన్నారు. అన్ని ప్రాంతాల వారిని సంప్రదించాకే కాంగ్రెస్ తెలంగాణ నిర్ణయం తీసుకుందని… రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్ర నేతలు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పనిలో పనిగా తెదేపా అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. బాబు ముఖ్యమంత్రిగా వున్నంతకాలం.. రాష్ట్రంలో కరువుకాటకాలేనని, రెండు కళ్ల సిద్ధాంతం అంటూ ఇరుప్రాంత ప్రజలను మోసం చేస్తున్నారని ఆమె విమర్శించారు.

Exit mobile version