Site icon TeluguMirchi.com

హైదరాబాద్‌లో నేటి నుండి డీజేలు నిషేదం


హైదరాబాద్‌లో నేటి నుండి డీజేలు పూర్తిగా నిషేదించినట్లు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఉత్తరువులు జారీచేశారు, ముఖ్యంగా మతపరమైన ర్యాలీలలో. ఈ నేపథ్యంలో కొన్ని కీలక నియమాలు విధించారు:

డీజే నిషేధం: మతపరమైన ర్యాలీలలో డీజేలు వాడడం పూర్తిగా నిషేధించబడింది.
సౌండ్ సిస్టమ్ పరిమితి: సౌండ్ సిస్టంలు అనుమతించినప్పటికీ, అవి పరిమిత స్థాయిలో మాత్రమే ఉండాలి. వాటి కోసం పోలీసుల నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవడం తప్పనిసరి.
డెసిబెల్ పరిమితులు:
ఉదయం: జనావాస ప్రాంతాల్లో ఉదయం 55 డెసిబెల్స్‌కి మించి సౌండ్ వినిపించకూడదు.
రాత్రి: రాత్రి వేళలో 45 డెసిబెల్స్ కంటే అధికంగా శబ్ధం వినిపించకూడదు.
బాణాసంచా నిషేధం: మతపరమైన ర్యాలీలలో బాణాసంచా కాల్చడం పూర్తిగా నిషేధించబడింది.
శిక్షలు: ఈ నియమాలు ఉల్లంఘించిన వారికి ఐదు సంవత్సరాల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించబడుతుంది. అదే విధంగా, నిబంధనలు పలుమార్లు ఉల్లంఘించినప్పుడల్లా ప్రతి రోజూ 5000 రూపాయల జరిమానా విధిస్తారు.

Exit mobile version