Site icon TeluguMirchi.com

ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ఇల్లు కట్టుకునేందుకు లైన్ క్లియర్

ఏపీలోని పేదలందరికీ ఇళ్లు పథకంపై హైకోర్టులోని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్‌ బెంచ్‌ రద్దు చేసింది. దీంతో ఇళ్ల స్థలాలపై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను పిటిషనర్లు వెనక్కి తీసుకున్నారు. గత నెల 8వ తేదీన పేదలందరికీ స్థలాలు పథకంలో భాగంగా ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఎటువంటి నిర్మాణాలు చేయొద్దని హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పిచ్చిన విషయం తెలిసిందే. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ మేరకు హైకోర్టులోని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నట్లు డివిజన్‌ బెంచ్‌ తీర్పునిచ్చింది. దీంతో పేదలకి ఇచ్చిన స్థలాల్లో ఇల్లు కట్టుకునేందుకు మార్గం సుగమమైంది.

Exit mobile version