రాయల తెలంగాణపై ఖండిచను : ఢిగ్గీరాజా

digvijay singరాయల తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై టీ-కాంగ్రెస్ నేతలను ఒప్పించే పనిలో నిమగ్నమయ్యారు కాంగ్రెస్ పెద్దలు. ఈ నేపథ్యంలోనే.. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ డీసీసీ ఛీప్ డీఎస్ మంతనాలు జరిపినట్లు సమాచారం. రాయల తెలంగాణపై
ఢిల్లీ పెద్దలు ఏ ఒక్కరూ కూడా ఖండించపోవడం.. కేంద్రం ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసిందనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

రాయల తెలంగాణకు సంబందించి ఏ అంశాన్ని ఖండించనని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ సైతం స్పష్టం చేశారు. దిగ్విజయ్ ఈరోజు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. రాయల తెలంగాణపై ఇప్పుడు తానేమీ మాట్లాడలేనని, జీవోఎం నివేదిక ఇచ్చిన తర్వాతే రాయల తెలంగాణపై స్పష్టం
వస్తుందని పేర్కొన్నారు. అయితే, శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు చర్చకు వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.