ఏపీలో సినిమా టికెట్ ధరల విషయంలో మంగళవారం మంత్రి పేర్ని నాని తో డిస్టిబ్యూటర్లు భేటీ అయ్యారు.ఈ భేటీలో సినిమా టికెట్ల రేట్లు పెంచాలని కోరారు.కార్పొరేషన్లలో ఏసీ థియేటర్లలో అత్యధికంగా రూ.150, అలాగే లోయర్ క్లాస్లో రూ. 50లు ఉండాలని డిస్ట్రిబ్యూటర్లు కోరారు.
అలాగే ఇతర ప్రాంతాల్లో ఏసీ థియేటర్లలో అత్యధికంగా రూ.100, లోయర్ క్లాస్లో రూ.40లు ఉండాలని కోరారు. ఇక కార్పొరేషన్లో నాన్ ఏసీలో అత్యధికంగా రూ. 100, లోయర్ క్లాస్లో రూ.40 ఉండాలని, నాన్ ఏసీలో ఇతర ప్రాంతాల్లో రూ. 80, రూ.30 ఉండాలని కోరారు డిస్టిబ్యూటర్లు. మరి వీరి కోరిక ఫై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.