Site icon TeluguMirchi.com

కమలంలో కల్లోలం !

BJP-logoరాష్ట్ర విభజన వ్యవహారం.. దాదాపు అన్ని పార్టీల్లో విభజనను తీసుకుకొచ్చినట్లు కనిపిస్తోంది. విభజన నిర్ణయం ప్రకటించిన కాంగ్రెస్ లో ఆ ప్రభావం కాస్త ఎక్కువగానే వుందనే చెప్పుకోవాలి. ఏకంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ ఛీఫ్ బొత్స లాంటివారు కూడా తమ అధిష్టాన నిర్ణయాన్ని బహిరంగానే విమర్శిస్తున్నారు. ఇక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెదేపాలోనూ ఏ ప్రాంతం వారు ఆ వాదానికి సపోర్ట్ చేయడమే గానీ…పార్టీ నిర్ణయానికీ కట్టుబడి వుంటామని బాహాటంగా చెప్పలేని పరిస్థితి. తాజాగా, క్రమశిక్షణకు మారు పేరని చెప్పుకొనే కమలం పార్టీలోనూ విభజన అంశం కల్లోలం సృష్టిస్తుంది.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం జరిగింది. కోర్ కమిటీ సాక్షిగా కమలం పార్టీలో కల్లోలం రేగింది. పార్టీ ప్రవర్తనను సీమాంధ్ర నేతలు సీరియస్ ప్రశ్నించారు. సీమాంధ్రలో పార్టీ కార్యాలయాలపై దాడులు జరుగుతున్నా, పార్టీ సమావేశాలను అడ్డుకుంటున్నా.. భౌతిక దాడులకు పాల్పడుతున్నా.. పార్టీ నిర్ణయాన్ని ఎదిరించలేదు. ఆడ్వాణీ, రాజ్‌ నాథ్ సింగ్, మోదీ తెలంగాణలోనే పర్యటించినా.. సర్దుకుపోయామని సీమాంధ్ర నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ కేసీఆర్ సీమాంధ్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వేదికపైనే బీజేపీ నేతలు వుండటం.. పైగా ఎటువంటి అభ్యంతరం తెలపకపోవడంపై సీమాంధ్ర భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

“మీరే పార్టీని నడిపించుకోండి.. నేను వైదోలుగుతానని” భాజపా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్ది అన్నాండంటే పరిస్థితి ఏ మేరకు వచ్చిందో అర్థంచేసుకోవచ్చు. విభజన లొల్లితో రెండు ప్రాంతాల భాజపా నేతలు హస్తినా బాట పట్టనున్నారు. ఆది నుంచి తెలంగాణకు అనుకూలమని ప్రకటికించిన కమలనాథులకు కూడా విభజన కష్టాలు తప్పడంలేదన్న మాట.

Exit mobile version